Share News

Indonesia Boat Dance: ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:15 PM

ఇండోనేషియా బోట్ రేసింగ్‌లో పాల్గొన్న ఓ బాలుడు నావపై డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనేక మంది అతడి డ్యాన్స్‌ను అనుకరిస్తూ నెట్టింట వీడియోలు షేర్ చేస్తున్నారు.

Indonesia Boat Dance: ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Indonesian Traditional Boat Race Dance

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడెక్కడి విశేషాలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇంట్లో కూర్చుని కూడా వివిధ దేశాల్లోని వింతలు, అద్భుతాలను వీక్షించే అవకాశం చిక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ బోట్ రేసింగ్ ఈవెంట్ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈవెంట్‌లో పాల్గొన్న ఓ బాలుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియాలో జరిగే ఈ సాంప్రదాయిక పాకూ జాలూర్ బోట్ రేసింగ్‌ను చూసేందుకు విదేశాల నుంచి వెళుతుంటారు. అయితే, తాజా ఉదంతంలో ఈ బాలుడి విన్యాసాల కారణంగా ఈ క్రీడలు మునుపెన్నడూ లేనంత పాప్యులారిటీని సాధించాయి (Viral Indonesia Boat Dance Video).


ఏమిటీ పాకూ జాలూర్.

ఇవి ఇండోనేషియాకు చెందిన సాంప్రదాయిక బోట్ రేసులు. స్థానికులు వీటికి కాస్త కళాత్మక కూడా జోడించారు. రకరకాల రంగుల్లో ఉండే నావలు నీళ్లపై దూసుకుపోతుంటే వాటి ముందు భాగంలో నిలబడే బాలురు నావ కదలికలను పోలినట్టు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తుంటారు. వీటిల్లో ఏ నావ ప్రత్యేకత దానిదే. ఇందుకు తగ్గట్టుగానే పడవ ముందు భాగంలోని బాలురు కూడా తమదైన రీతిలో ప్రత్యేకంగా డ్యాన్సులు చేస్తుంటారు. ఇది చూసి ప్రపంచవ్యాప్తంగా జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీల్లో కళాత్మకతను జొప్పించిన తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.


అయితే, ఈ బోట్ రేసింగ్‌లోని ఓ బాలుడి డ్యాన్స్ జనాలను విశేషంగా ఆకట్టుకోవడంతో అనేక మంది అదే విన్యాసాలను తామూ చేసి వాటి వీడియోలను నెట్టింట పంచుకుంటున్నారు. కొందరు బైక్ నడుపుతూ వీడియోలోని బాలుడిలా డ్యాన్స్ చేశారు. మరికొందరు ఏకంగా రేస్ కారుపై డ్యాన్స్ చేసి చూపించారు. ఇలా ఒకరిని మించి మరొకరు బాలుడిని అనుకరిస్తూ వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. మరి మీరూ ఈ వీడియోలపై ఓ లుక్కేయండి.


ఇవీ చదవండి:

పీహెచ్‌డీ చేసినా డెలివరీ బాయ్‌గా జీవనం.. ఇతడి స్టోరీ తెలిస్తే..

నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం

Read Latest and Viral News

Updated Date - Jul 09 , 2025 | 02:06 PM