Bride Groom Funny Video: వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. ఇలా అయ్యిందేంటీ..
ABN, Publish Date - Aug 13 , 2025 | 08:22 PM
ఓ వివాహ విషయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. మంటపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని చూసిన వధూవరులకు చివరకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
పెళ్లిలో వింత సంఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. ఎదో ఒక వినూత్న సంఘటన జరక్కపోతే.. అది వివాహం కాదేమో అన్నంతలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు వధూవరుల మధ్య చోటు చేసుకునే సంఘటనలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని చూసి వధూవరులకు చివరకు ఎలాంటి షాక్ తగిలిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరుల (Bride and groom) విషయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏ వివాహ కార్యక్రమంలో చూసినా.. వధూవరులు వినూత్నంగా ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. దీంతో ఈ వధూవరులు కూడా అలాగే వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నట్లున్నారు.
జేసీబీ బకెట్‌లో కూర్చుని మంటపంలోకి ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అంతా అనుకున్నట్లుగానే ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఫైనల్‌గా జేసీబీ బకెట్‌ను అందగా అలంకరించి, అందులో కూర్చున్నారు. మంటపంలోకి కూడా అంతే దర్జాగా ఎంట్రీ ఇచ్చారు. అయితే తీరా లోపలికి వచ్చాక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వధూవరులిద్దరూ నవ్వుతూ చేతులూ ఊపుతూ అందరినీ విష్ చేస్తున్నారు. ఈ సమయంలో జేసీబీ డ్రైవర్.. బకెట్‌ను తలకిందులుగా చేశాడు. దీంతో అందులో (Bride and groom fall from JCB) కూర్చున్న వధూవరులు ఇద్దరూ ధబేల‌్‌మని కిందపడ్డారు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే టేబుల్‌పై పడడడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదో చేయాలని అనుకుంటే ఇంకేదో అయ్యిందే’.. అంటూ కొందరు, ‘ఈ జేసీబీ డ్రైవర్.. ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నాడో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 13 , 2025 | 08:22 PM