ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elephant Funny Video: అరటిపండు ఇవ్వలేదని అలిగింది.. ఈ ఏనుగు పిల్ల ఏం చేసిందో చూస్తే..

ABN, Publish Date - Aug 03 , 2025 | 11:17 AM

ఓ పిల్ల ఏనుగు తన తల్లి వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఓ వ్యక్తి అరటి పండ్లు తీసుకుని అటుగా వెళ్లాడు. అరటి పండ్లను చూడగానే పిల్ల ఏనుగు పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లింది. అయితే ఆ వ్యక్తి దానికి పండ్లు ఇవ్వకుండా కాసేపు ఆట పట్టించాడు. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

జంతువులు మనుషులను అనుకరించడం సర్వసాధారణం. పిల్లులు, కోతులు, కుక్కలు, చింపాంజీలు.. మనుషులు చేసే పనులను మక్కీకి మక్కీ దింపేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు పిల్ల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అరటిపండు కోసం ఓ ఏనుగు పిల్ల ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఇవ్వకపోవడంతో చివరకు ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్ల ఏనుగు (Baby Elephant) తన తల్లి వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఓ వ్యక్తి అరటి పండ్లు తీసుకుని అటుగా వెళ్లాడు. అరటి పండ్లను చూడగానే పిల్ల ఏనుగు పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లింది. అయితే ఆ వ్యక్తి దానికి పండ్లు ఇవ్వకుండా కాసేపు ఆట పట్టించాడు. అరటి పండ్ల కోసం దగ్గరికి వెళ్లిన పిల్ల ఏనుగు.. పదే పదే తొండం పైకి ఎత్తి అటూ, ఇటూ తిరుగుతంది.

అయినా అతను మాత్రం అరటి పండ్లు ఇవ్వకుండా దూరంగా జరిగాడు. దీంతో చివరకు పిల్ల ఏనుగుకు చిర్రెత్తుకొచ్చింది. పిల్లలు ఎలాగైతే అలిగి మారాం చేస్తారో.. అచ్చం అలాగే ఈ పిల్ల ఏనుగు కూడా గెంతులు వేస్తూ .. ‘నాకు అరటిపండ్లు కావాల్సిందే.. ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిందే’’.. అంటూ మారం చేసింది. ఇది చూసేందుకు అచ్చం చిన్న పిల్లల్లానే అనిపించింది. దీంతో అంతా ఈ పిల్ల ఏనుగును ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగు పిల్లను చూస్తుంటే ముచ్చటేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఏనుగు పిల్ల అలిగితే ఎంత బాగుందో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 4.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 12:03 PM