Samosas: సమోసాలను త్రిభుజాకారంలోనే ఎందుకు తయారు చేస్తారు.. సమాధానం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN, Publish Date - Nov 30 , 2025 | 10:02 PM
సమోసాలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వర్షంలో వేడి వేడి సమోసాలు తింటే ఆ మజానే వేరు. అయితే సమోసాలు ఎందుకు త్రిభుజాకారంలోనే తయారు చేస్తారు.
సమోసాలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వర్షంలో వేడి వేడి సమోసాలు తింటే ఆ మజానే వేరు. అయితే సమోసాలు ఎందుకు త్రిభుజాకారంలోనే తయారు చేస్తారు. దీనికి కారణం కారణం చాలా మందికి తెలీకపోవచ్చు. ఎందుకు అలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సమోసాలను త్రిభుజాకారంలో తయారు చేయడం వల్ల.. మిశ్రమాన్ని అందులో చొప్పించడం సులభమవుతుంది. అలాగే త్రిభుజాకారంలో ఉండడం వల్ల నూనెలో వేయించే సమయంలో లోపలి మిశ్రమం బయటికి చెందకుండా నిరోధిస్తుంది.
సమోసాలు త్రిభుజాకారంలో ఉండడం వల్ల పట్టుకుని తినడానికి కూడా సులభంగా ఉంటుంది. అందులోని మిశ్రమం కూడా కిందపడకుండా తినేందుకు వీలుంటుంది.
సమోసాలు మొదటిసారిగా మధ్య ఆసియాలో తయారు చేశారని అంతా నమ్ముతారు. దీని పర్షియన్ పేరు సంబుసాగ్. ఇది పిరమిడ్ ఆకారాన్ని సూచిస్తుంది. అందుకే ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుందని కొందరు చెబుతున్నారు.
11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అబుల్-ఫజల్ బైహకి ముహమ్మద్ ఘజ్నవి రాజ సభలో మొదటిసారిగా ఈ సమోసాల గురించి ప్రస్తావించాడట. ఆ సమయంలో సమోసాల్లో గింజలు, మాంసం ముక్కలను నింపేవారట.
16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారతదేశానికి బంగాళాదుంపలను పరిచయం చేశారు. అప్పటి నుంచి సమోసాల్లో బంగాళాదుంపల మిశ్రమాన్ని నింపుతున్నారని చెబుతున్నారు.
Updated Date - Nov 30 , 2025 | 10:02 PM