Hair Health: బాదంతో ఇలా చేశారంటే.. వృద్ధాప్యంలోనూ మీ జుట్టు నల్లగానే ఉంటుంది..
ABN, Publish Date - Sep 19 , 2025 | 05:42 PM
ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లలకు కూడా జుట్టు తెల్లగా మారుతోంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా మంది రంగు వేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే
ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లలకు కూడా జుట్టు తెల్లగా మారుతోంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా మంది రంగు వేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఎలాంటి రంగు వాడకుండా బాదం పప్పుతో సహజసిద్ధంగా జుట్టును నల్లగా ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ తొక్క తీసి స్టవ్ మీద నల్లగా మారే వరకూ కాల్చాలి. ఆ తర్వాత నాలుగు బాదంపప్పులను కొద్దిగా వేడి చేయాలి. చివరగా ఈ రెండింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఉల్లిపాయ, బాదంపప్పుల పొడిలో రెండు, లేదా మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. జుట్టును బలంగా చేయడంతో పాటూ మృదువుగా మార్చడంలో కొబ్బరినూనె బాగా పని చేస్తుంది.
సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేయాలి. అరగంట సేపు అలాగే ఉంచుకుని, తర్వాత నీటితో కడుక్కోవాలి.
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు.
రసాయన రంగుల స్థానంలో ఈ మిశ్రమాన్ని ట్రై చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటూ నల్లగా మారుతుంది.
ఈ విషయలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా సంబంధిత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Updated Date - Sep 19 , 2025 | 05:44 PM