ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dangerous Rivers: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 5 నదులివే..

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:22 AM

ప్రపంచంలో కొన్ని వేల నదులు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం 5 నదుల పేరు చెబితే గుండె గుబేల్‌మంటుంది. పొరపాటున ఈ నదుల్లో దిగినా, దాని చుట్టు పక్కల ఉన్నా ప్రాణాలకే ప్రమాదం..

1/7

ప్రపంచంలో కొన్ని వేల నదులు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం 5 నదుల పేరు చెబితే గుండె గుబేల్‌మంటుంది. పొరపాటున ఈ నదుల్లో దిగినా, దాని చుట్టు పక్కల ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. ఇంతకీ ఆ నదులు ఏంటీ, ఎక్కడెక్కడ ఉన్నాయి.. తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

దక్షిణ అమెరికాలోనే అతి పెద్దదైన అమెజాన్ నది 7000 కిలోమీటర్లు విస్తరించింది. బ్రెజిల్ నుంచి పెరూ వరకూ ప్రవహిస్తున్న ఈ నది.. అనకొండలు, మొసళ్లు, ఎలిగేటర్లు, ప్రమాదకరమైన పాములతో నిండి ఉంటుంది. ప్రతి ఏడాదీ ఈ నదిలో వదలాది మంది మరణిస్తుంటారట. అలాగే ఈ నది నీరు చాలా లోతుగా ఉండడం వల్ల సుడిగుండాలు, బలమైన ప్రవాహాలు సంభవించి పడవలు బోల్తా పడే ప్రమాదం ఉంటుంది.

3/7

దక్షిణ అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రవహించే ఎర్ర నది ప్రమాదకరమైన నదుల్లో ఒకటి. ఈ నది చూసేందుకు అందంగా ఉన్నా కూడా.. ఆకస్మిక వరదలు సంభవిస్తుంటాయి. అలాగే మనుషులను లోపలికి లాక్కునే లోతైన సుడిగుండాలు కూడా ఉంటాయి. ప్రశాతంగా కనిపించే ఈ నది.. రాత్రి వేళల్లో భయంకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు.

4/7

స్పెయిన్‌లోని రియోటింటో నది కూడా ఎంతో ప్రమాదకరమైనది. ఈ నది నీరు రక్తం రంగులో ఉంటుంది. రాగి, సల్ఫర్ గనుల నుంచి వచ్చే ఖనిజాల కారణంగా ఈ నది నీటికి ఆ రంగు వచ్చింది. ఈ నది నీటిలో స్నానం చేయడం, తాగడం ఎంతో ప్రమాదం. ఈ నదిలో ఎలాంటి చేపలూ, జంతువులూ ఉండవు. కేవలం ఈ నది నీటిలోని ఆమ్లాన్ని తట్టుకునే సూక్ష్మజీవులు మాత్రమే సంచరిస్తుంటాయి.

5/7

చైనాలోని ఎల్లో రివర్ కూడా ప్రమాదకరమైన నదుల్లో ఒకటి. ఈ నది ప్రపంచంలోనే పొడవైన నదుల్లో ఆరవది. 5,464 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నది.. 24 సార్లు తన దిశను మారుస్తుందట. ప్రతి ఏడాదీ ఈ నదిలో వరదల కారణంగా వేలాది మంది మరణిస్తుంటారట. 1949 నుంచి ఇప్పటి వరకూ 3 మిలియన్ల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నది వరలు గ్రామాలను కూడా నాశనం చేయగలవట.

6/7

ఆస్ట్రేలియాలోని కాహిల్స్ క్రాసింగ్ నది మొసళ్లతో నిండి ఉంటుంది. ఈ నది 4 మైళ్ల దూరంలో సుమారు 120 వరకూ మొసళ్లు కనిపిస్తుంటాయట. పొరపాటున ఈ నది నీటిలో పడితే ఇక బతికిబట్టగట్టే అవకాశమే లేదు. దీంతో ఈ నది కూడా ప్రమాదరమైన నదుల్లో ఒకటిగా నిలిచింది.

7/7

ఈ నదులను చూడాలంటే తప్పనిసరిగా గైడ్‌ను వెంటపెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా విహారయాత్ర కాస్తా విషాదంగా మారే ప్రమాదం ఉంటుంది.

Updated Date - Sep 24 , 2025 | 08:22 AM