Wildlife Safari Tour: వణ్యప్రాణులను చూడటానికి దేశంలోని 5 ఉత్తమ ప్రదేశాలివే..
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:59 PM
భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ..
భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 5 ఉత్తమ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్‌లో వణ్యప్రాణులతో పాటూ పురాతన శిథిలాలు, చారిత్రాత్మక కోటలను కూడా చూడొచ్చు. బెంగాల్ టైగర్‌తో పాటూ అనేక రకాల పులులు, చిరుతులు, ఎలుగుబంట్లు, మొసళ్లు తదితరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
అస్సాంలోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం కూడా వణ్యప్రాణుల సదర్శనకు ఉత్తమ ప్రదేశమని చెప్పొచ్చు. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఒక్కడ చూడొచ్చు. అలాగే అడవి నీటి గేదెలు, చిత్తడి జింకలతో పాటూ వివిధ రకాల పక్షులను కూడా ఇక్కడ సందర్శించవచ్చు.
మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్క్.. దేశంలోని సుందరమైన జాతీయ ఉద్యానవనాల్లో ఒకటి. ఇక్కడ బెంగాల్ టైగర్, చిత్తడి జంకలు, చిరుతలు, అడవి కుక్కలు తడితర జంతువులను చూడొచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంలోనూ అనేక వణ్యప్రాణులను చూడొచ్చు. ఈ ప్రాంతం రాయల్ బెంగాల్ టైగర్ నివాస స్థలమని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అనేక మొసళ్లు, అరుదైన పక్షులు కూడా కనువిందు చేస్తాయి.
కర్ణాటక బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక వణ్యప్రాణులతో పాటూ అనేక రకాల వృక్షాలు, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
Updated Date - Jun 29 , 2025 | 03:59 PM