ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rain In Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షం..

ABN, Publish Date - Sep 22 , 2025 | 09:06 AM

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది. వర్షం ధాటికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

1/6

హైదరాబాద్‌లో నిన్న(ఆదివారం) రాత్రి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, నిజాంపేట్, కూకట్‌పల్లి, మణికొండ, ఫిలింనగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌‌లో వర్షం దంచికొట్టింది.

2/6

షేక్‌పేట, టోలిచౌకి, ఎస్సార్‌‌నగర్‌, పంజాగుట్ట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, చాదర్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, మాదన్నపేట, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ , బండ్లగూడా జాగీర్లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

3/6

వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

4/6

వర్షానికి లోతట్టు ప్రాంతాల చెరువుల తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి.

5/6

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. వాన పడుతుండటంతో జీఎచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుసింది.

6/6

నగరంలో పడిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. రాబోయో రెండు, మూడు రోజుల్లో కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Updated Date - Sep 22 , 2025 | 09:15 AM