Antidote for Snake Venom: ఈ జంతువు కన్నీళ్లు పాము విషానికి విరుగుడు..!
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:54 PM
Camel tears antidote for Snake Venom: బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ (NRCC), దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబ్ చేసిన పరిశోధనలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ఈ జంతువు కన్నీళ్లకు 26 పాము జాతుల విషాన్ని తటస్థీకరించే సామర్థ్యం ఉందని వారు కనుగొన్నారు.
దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిర్వహించిన అధ్యయనంలో సంచలనాత్మక నిజాలు వెల్లడయ్యాయి. ‘ఎడారి ఓడ’గా పిలిచే ఒంటె కన్నీళ్లకు పాము విషాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఉన్నట్లు పరిశోధకులు ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడించారు.
26 పాము జాతుల విషాన్ని తటస్థీకరించే అద్భుత సామర్థ్యం ఒంటె కన్నీళ్లకు ఉందని పరిశోధక బృందం వెల్లడించింది. ఒంటె కన్నీళ్లలో పాము విషాన్ని తటస్థీకరించే ప్రత్యేక యాంటీబాడీలు, ప్రోటీన్లు (లైసోజైమ్) ఉంటాయి. ఇవి సహజ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాయి.
ఒంటె కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ఎడారిలో ఒంటెలను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు. సా-స్కేల్డ్ వైపర్ వంటి అత్యంత విషపూరితమైన పాముల విషానికి కూడా ఒంటె కన్నీళ్లు విరుగుడుగా పనిచేస్తాయని NRCC పరిశోధకులు వెల్లడించారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం పాము కాటు కారణంగా వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. కోబ్రా, క్రైట్, రస్సెల్ వైపర్ వంటి పాముల విషం మానవుల నాడీ వ్యవస్థను, రక్త ప్రసరణను నాశనం చేస్తుంది. పాము కాటుకు గురైన వారికి ఒంటె కన్నీటితో తయారుచేసిన యాంటీబాడీలు తక్షణ చికిత్సగా ఉపయోగపడతాయి.
ఒంటె కన్నీళ్ల నుండి చౌకైన, ప్రభావవంతమైన యాంటీ-విష మందులను తయారు చేయవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది విప్లవాత్మక ఆవిష్కరణ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులకు ఇది వరంలాంటిదని అంటున్నారు.
రాజస్థాన్‌లోని రైతులు ఒంటె కన్నీళ్లు, రక్త నమూనాలను సరఫరా చేస్తూ నెలకు ఒక్కో ఒంటె ద్వారా రూ. 5,000-10,000 సంపాదిస్తున్నారు. తద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. అయితే, ఒంటె కన్నీళ్ల ఆధారంగా మందుల తయారీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.
Updated Date - Jul 11 , 2025 | 05:57 PM