ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty Tips: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోతుంది..

ABN, Publish Date - Aug 13 , 2025 | 05:59 PM

ప్రస్తుత యువత ముఖ సౌందర్యం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు..

1/7

ప్రస్తుత యువత ముఖ సౌందర్యం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ముఖ్యంతా రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

రాత్రి పడుకునే మందు ముఖానికి కొబ్బరినూనె రాయడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు రాకుండా ఉంటాయి. పొడి చర్మానికి కొబ్బరినూనె మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

3/7

రాత్రి పడుకునే ముందు ముఖానికి విటమిన్-ఇ ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం తేమను సరిపడా ఉండేలా చేయడంతో పాటూ మెరిసేలా చేస్తుంది.

4/7

ముఖానికి పసుపు పాలను రాయడం వల్ల కూడా మెరుగైన ఫలితం ఉంటుంది. పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని సంరక్షిస్తుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అదేవిధంగా పసుపులో ఉంటే కర్కుమిన్ మంటను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

5/7

ముఖానికి రోజ్ వాటర్ రాయడం వల్ల చర్మంలో పీహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటూ అవసరమైన తేమను అందిస్తుంది. అలాగే ఇందులోని యంటీఆక్సిడెంట్లు సూర్య కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

6/7

కలబంద కూడా చర్మానికి మంచి ఔషధంలా పని చేస్తుంది. ముఖంపై కలబంద గుజ్జు రాయడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే చర్మంపై సరిపడా తేమ ఉండేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కలబంద రాయడం వల్ల చర్మం మృదువుగా మారిపోతుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 13 , 2025 | 05:59 PM