ABN Andhrajyothy 16 Anniversary: ఘనంగా వార్షికోత్సవం.. కేక్ కట్ చేసిన సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ..
ABN, Publish Date - Oct 15 , 2025 | 01:46 PM
అక్షరమే ఆయుధంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. మరో మైలురాయిని అధిగమించింది. టీనేజ్ సెన్సేషన్‌గా అద్భుతాలు సృష్టించిన ఏబీఎన్ 16 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

16 వసంతాలుగా ప్రతి ఏడాదీ కొత్త అనుభవాన్ని, అనుభూతిని అందుకుంటూ, దాన్ని తెలుగుప్రజల ప్రయోజనానికి వినియోగిస్తూ.. ఏబీఎన్ తన జైత్యయాత్రను కొనసాగిస్తోంది. చానెల్ ఆవిర్భావమే ఒక సెన్సేషన్ కాగా.. ప్రతి నిత్యం సహేతుకమైన జర్నలిజంతో ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 16వ వార్షికోత్సవం సందర్భంగా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరై కేట్ కట్ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 15 , 2025 | 01:48 PM