మహిళా పోలీస్ అధికారులపై డీజీపీ ప్రశంసలు
ABN, Publish Date - Dec 30 , 2025 | 02:37 PM
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలో నేరాలు, శాంతి భద్రతలపై ఈ ఏడాది (2025) వార్షిక నివేదికను డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా జరిపామని వివరించారు. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలో నేరాలు, శాంతి భద్రతలపై ఈ ఏడాది (2025) వార్షిక నివేదికను డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ కోసం భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా జరిపామని వివరించారు. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామన్నారు.
తెలంగాణలో 509 మంది నక్సల్స్ లొంగిపోయారని తెలిపారు. నాలుగు నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించమని.. అందులో 7 లక్షల కేసులు పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు సైతం అభినందించిందని ఈ సందర్భంగా డీజీపీ గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళా పోలీసుల అధికారులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
ఈ సమావేశంలో సీఐడీ చీఫ్, ఏసీబీ డీజీ చారు సిన్హా , తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా షికా గోయల్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి తదితరులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్ బ్యాక్ కోసం ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
Updated Date - Dec 30 , 2025 | 02:40 PM