ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallu Bhatti Vikramarka: కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన మల్లు భట్టి విక్రమార్క

ABN, Publish Date - Jun 08 , 2025 | 08:58 AM

కర్నూలు జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు.

1/6

కర్నూలు జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు.

2/6

ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని ఉద్ఘాటించారు.

3/6

ఒక్క ప్రదేశంలోనే 6,680 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి, 2025 న్యూ ఎనర్జీ పాలసీ అమల్లోకి తీసుకువచ్చిందని మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

4/6

విద్యుత్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లక్ష కోట్ల విలువైన ఎంవోయూలను గ్రీన్ ఎనర్జీ కోసం చేసిందని స్పష్టం చేశారు.

5/6

బొగ్గు ఆధారిత విద్యుత్తు వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు సోలార్, విండ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ వంటి మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. విద్యుత్ సరఫరా పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని..ఉపాధి పెరుగుతుంది, జీడీపీ పెరుగుతుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

6/6

భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్‌దేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దానిని ముందుగానే అర్థం చేసుకుని గ్రీన్ ఎనర్జీలో దేశానికి మార్గదర్శిగా నిలవబోతుందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 09:05 AM