పండగ రాకతో బస్టాండ్లలో జనాల కిటకిట..
ABN, Publish Date - Aug 09 , 2025 | 05:51 PM
వీకెంట్, రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
వారాంతం, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలంతా పిల్లాపాపలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
భారీ ఎత్తున ప్రజలు సొంతూళ్లకు కుటుంబసమేతంగా బయల్దేరడంతో బస్టాండ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి.
విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్దీ ఊళ్లకు పయనమయ్యే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
భారీ ట్రాఫిక్ జాం దాటుకుని బస్సులు బస్టాండ్ చేరుకునేసరికి ఆలస్యమవుతుంది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే, పండగను క్యాష్ చేసుకునేందుకు స్పెషల్ బస్సులు పేరిట 30 శాతం అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Aug 09 , 2025 | 06:04 PM