Home » Rakhi festival
రాఖీ పండుగ వరంగల్ రీజియన్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెద్ద సంఖ్యలో నడిపింది.
‘తమ్ముడూ లేరా.. ఈరోజు రాఖీ పండుగ. నీ అక్కతో రాఖీ కట్టించుకో..’ అని విలపిస్తూ ఆ సోదరి తన తమ్ముడి మృతదేహానికి రక్ష కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబమే కాదు.. బంధువులు, స్థానికులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్లకు ఒకే మూల సంఖ్య ఉంటే.. వారి స్వభావాలు, ఇష్టాలు కొంతవరకు ఒకేలా ఉండే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. దీంతో వారి మధ్య అనుబంధం ఎలా ఉండొచ్చు? ఎలాంటి విషయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది?
రక్షాబంధన్‌ను పురస్కరించుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు ఊర్లకు పయనమయ్యారు. రాఖీ పండుగతో పాటు వరుస సెలవులు కావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు.
రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. అయితే అసలు ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? రక్షాబంధన్ చరిత్ర, విశిష్టత గురించి తెలుసుకుందాం..
రక్షాబంధన్ సందర్భంగా జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రజలు సుమారు లక్ష చెట్లకు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రకృతిని నిత్యం పరిరక్షిస్తామని హామీ ఇస్తున్నారు.
పవిత్రమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని.. అది ప్రేమకు, నమ్మకానికి, బాధ్యతకు జీవితాంతం నిలిచే అనుబంధానికి ప్రతీకన్నారు.
హెల్మెట్లు లేని వాహనదారులకు ఎప్పుడూ చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు.. నేడు వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. నేడు రక్షాబంధన్ సందర్భంగా ప్రేమతో రాఖీలు కట్టారు.