Share News

Pawan Kalyan: ఆడబిడ్డల అభివృద్ధే మా లక్ష్యం.. పవన్ భావోద్వేగం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:07 PM

రాఖీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: ఆడబిడ్డల అభివృద్ధే మా లక్ష్యం.. పవన్ భావోద్వేగం
Pawan Kalyan ON Raksha Bandhan Wishes

అమరావతి, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగ (Raksha Bandhan) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని వ్యాఖ్యానించారు. రాఖీ అంటే కేవలం ఓ దారం కాదని... అది మన అనుబంధాలకు ఓ భావోద్వేగాల సంకేతమని అభివర్ణించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఇవాళ (శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు.


కూటమి ప్రభుత్వం మహిళలకు మేలు చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే దీపం-2, తల్లికి వందనం పథకాలను విజయవంతంగా ఆచరణలోకి తెచ్చిందని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని స్వాతంత్య్ర దినోత్సవం నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు పవన్ కల్యాణ్.


గిరిజన ప్రాంతాల్లో డోలీలు లేకుండా ప్రయాణించేలా రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ఉద్ఘాటించారు. అడవి తల్లి బాట పేరుతో రహదారులు వేసే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రజా జీవితంలో తాను వేసే అడుగుల్లో- ఆడపడుచులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. వారి అభివృద్ధి కోసం తన ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

For More AP News and Telugu News

Updated Date - Aug 09 , 2025 | 01:20 PM