Share News

Pulivendula ZPTC BY Elections: నువ్వా నేనా.. పులివెందులలో వేడెక్కిన వాతావరణం

ABN , Publish Date - Aug 09 , 2025 | 08:36 AM

సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.

Pulivendula ZPTC BY Elections: నువ్వా నేనా.. పులివెందులలో వేడెక్కిన వాతావరణం
Pulivendula ZPTC BY Elections

» నువ్వా.. నేనా.. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ముమ్మరంగా ప్రచారం

» టీడీపీ నుంచి మంత్రులు, వైసీపీ నుంచి కీలక నేతలు ఇంటింటా ప్రచారం

» సునీత వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో కలవరం

» పులివెందులలో టెన్షన్ టెన్షన్

» స్వతంత్ర అభ్యర్థులకు గన్‌మెన్ల భద్రత

» ఒంటిమిట్ట టీడీపీలో నేతల మధ్య కోఆర్డినేషన్ కరువు

» రేపే ప్రచారానికి తెర

(కడప - ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు (Pulivendula ZPTC BY Elections) అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. అయితే అప్పట్లో జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మనం చూసిందే. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ దగ్గర పడుతుండటంతో ఈ ఎన్నికలు కాక రేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.


ఉమ్మడి సొంత జిల్లాలో గత ఎన్నికల్లో ఏడు స్థానాలను వైసీపీ కోల్పోయి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు సొంత జిల్లాలో ముఖ్యంగా సొంత గడ్డలో జరిగే ఉప ఎన్నిక టీడీపీ అనూహ్యంగా పంజుకుని భారీ స్థాయిలో పోటీనిస్తూ నువ్వా నేనా అన్నట్లుగా తీవ్ర పోటీనిస్తుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఈ జగన్ అండ్ కోను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో దివంగత వివేకా కూతురు డాక్టర్ సునీత వివేకా మర్డరుపై చేస్తున్న కామెంట్స్ వైసీపీలో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇక పులివెందులలో మంత్రి సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాధవీ, జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, వైసీపీ నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, ఇక ఒంటిమిట్టలో మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధనరెడ్డిలు ఇతర టీడీపీ నేతలు ప్రచారం నిర్వహించారు.


పులివెందులలో పోటాపోటీ

పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. నిన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహారించి వైసీపీ నుంచి పెద్దఎత్తున టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు. రోజూ చేరికలతో టీడీపీలో జోష్ నింపుతుంది ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్‌రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు.


వైసీపీలో కలవరం

వివేకా జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చిన డాక్టర్ సునీత వివేకా హత్య గురించి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలవరానికి గురి చేస్తున్నాయి. వివేకా హత్యలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రమేయం, చనిపోయిన రోజు కనీసం ఊరేగింపు కూడా జగన్ చేయలేదంటూ జగన్‌పైన, పులివెందులలో హత్య రాజకీయాలు మారాలంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను టెన్షన్‌లో పడేశాయి. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.


స్వతంత్య్ర అభ్యర్థులకు గన్ మెన్లు

పులివెందులలో ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్‌‌మెన్ సౌకర్యం కల్పించారు.


రవాణా సదుపాయం

ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను జిల్లాకు పోలింగ్ రోజున రప్పించేందుకు గానూ వారికి అవసరమైన రవాణా సదుపాయాన్ని చేస్తున్నారు. రానూ పోనూ వాహనాలకు అయ్యే ఖర్చును ఇప్పటికే ఓటర్ల అకౌంటులో జమ చేశారు.


ఒంటిమిట్టలో గ్రూపు తగాదాలు

ఒంటిమిట్టలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య కోఆర్డినేషన్ కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్‌గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్‌చార్జ్‌ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. శుక్రవారం మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్ అమీర్‌బాబు, ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఒంటిమిట్టలో పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుంది. ఒంటిమిట్లలో టీడీపీ నేతలను సయోధ్యపరచి అందరినీ పోలింగ్‌కు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Raksha Bandhan 2025: అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు

AP Government Schools: ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం

For More AP News and Telugu News

Updated Date - Aug 09 , 2025 | 08:42 AM