Share News

AP Government Schools: ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం

ABN , Publish Date - Aug 09 , 2025 | 07:21 AM

పుస్తకం.. ఇక విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానుంది. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో అగ్రస్థానంలో ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు.. అనే విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి జవాబులను ఈ పుస్తకాల్లో రాయించనున్నారు.

AP Government Schools: ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం
AP Government Schools

» పుస్తకమే ప్రామాణికం

» ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం

» 1-10 వరకు ఎఫ్ఎ, ఎస్ఏ పరీక్షల్లో బుక్లెట్లు

» 72 పేజీలతో బుక్ లెట్లు ఇవ్వాలని నిర్ణయం

>> ఇకపై జవాబులు రాయాల్సింది అందులోనే..

» ప్రతి పరీక్షకు విద్యార్థి పురోగతి తెలుసుకునేందుకు దోహదం

» ఈనెల 11 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం

పుస్తకం.. ఇక విద్యార్థుల ప్రతిభకు కొలమానం కానుంది. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో అగ్రస్థానంలో ఉన్నాడు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడు.. అనే విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి జవాబులను ఈ పుస్తకాల్లో రాయించనున్నారు. అదెలా అంటే...


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో (AP Government Schools) ఒకటి నుంచి పదోతరగతి వరకు ఉన్న విద్యార్థులకు పార్మెటివ్ అసెస్‌మెంట్, సమ్మిటివ్ అసెస్‌మెంట్ విధానాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు విద్యార్థులతో ఓ ప్రశ్నకు జవాబు రాయించడానికి ఉపాధ్యాయులు వేర్వేరు విధానాలు అవలంబించేవారు. కొంతమంది ఉపాధ్యాయులు వారి సబ్జెక్ట్‌కు సంబంధించి జవాబులు రాయడానికి ఒక చిన్న పుస్తకాన్ని విద్యార్థులకు ఇచ్చేవారు. మరికొంతమంది ఉపాధ్యాయులు తెల్లకాగితాలు, రూల్ కాగితాలను ఇచ్చేవారు. ఇలా ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో విధానంలో అసెస్‌మెంట్‌‌ను అమలు చేస్తుండటంతో అంతా ఒకే విధానంలో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది.


72 పేజీలతో బుక్‌లెట్

విద్యాసంవత్సరంలో నాలుగు. ఫార్మెటివ్ అసెస్మెంట్లు, రెండు సమ్మెటివ్ అసెస్మెంట్లు నిర్వ హిస్తారు. వాటికి సంబంధించిన తేదీలను విద్యాశాఖ నిర్ణయిస్తుంది. ఈ నెల 11 నుంచి 13 వరకు ఎఫ్ఏ1 నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాయడానికి 72 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను ఇవ్వనున్నారు. ఒక తరగతిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో... అన్నింటికీ ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. ప్రశ్నాపత్రాల్లోని జవాబులు ఈ పుస్తకాల్లో రాయాలి. దీనివల్ల విద్యార్థులు పురోగతి ప్రమాణాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. ఒక ఎఫ్ఏకి, మరో ఎఫ్ఏకి మధ్య విద్యార్థుల్లో ప్రతిభా సామర్థ్యాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుస్తుంది. విద్యార్థులు రాసిన జవాబులను దిద్దేటప్పుడు ఉపాధ్యాయులు రిమార్కులను రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రశ్నకు రాయాల్సిన జవాబు రాయకుండా మరో జవాబు రాస్తే అది కచ్చితంగా తప్పవుతుంది. దానికి సున్నా మార్కులు వేస్తారు. అలా ఎందుకు రాశారో ఆ జవాబుకు పక్కనే రిమార్క్ రాయాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Raksha Bandhan 2025: అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు

శ్రీశైలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

For More AP News and Telugu News

Updated Date - Aug 09 , 2025 | 07:24 AM