Union Minister Ramnath Thakur: దళారీలు లేకుండా ఏపీ రైతులకు 816 కోట్ల బదిలీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:50 AM
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద ఏప్రిల్-జులై 2025 కాలానికి ఏపీలోని 40.06 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 816.14 కోట్ల మొత్తం జమ అయిందని రాజ్యసభలో...
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద ఏప్రిల్-జులై 2025 కాలానికి ఏపీలోని 40.06 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 816.14 కోట్ల మొత్తం జమ అయిందని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి రాంనాథ్ థాకూర్ తెలిపారు. శుక్రవారం టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సమన్వయం, భూరికార్డులు, ఆధార్ కార్డుల అనుసంధానం, పరిశీలన ప్రక్రియ వల్ల ఈ బదిలీ సాఫీగా జరిగినట్లు తెలిపారు. దీని వల్ల మధ్యదళారులకు ఆస్కారం లేకుండా చేశామని చెప్పారు. మూడు సమాన వాయిదాల్లో రూ.6వేలను రైతులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వారి అదనపు ఆదాయానికి, వ్యవసాయ ఉపకరణాలకు పెట్టుబడులకు ఉపయోగపడుతుందని తెలిపారు.