Road Accident in Nellore: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:25 AM
లారీని తుపాన్ వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతిచెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): లారీని తుపాన్ వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతిచెందారు. ఈ ప్రమాదం నెల్లూరు జిల్లాలోని (Road Accident in Nellore District) ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారు పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలను మంత్రి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైద్యాధికారులకు మంత్రి మండిపల్లి కీలక ఆదేశాలు
ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీరని లోటని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంపై మంత్రి అనగాని ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుబంధాలకు గుర్తుగా రక్షాబంధన్ వేడుకలు
ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం
For More AP News and Telugu News