TDP VS YSRCP: పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:06 AM
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్‌లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
కడప, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు కుయుక్తులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి (TDP Leader BTech Ravi) సంచలన ఆరోపణలు చేశారు. పులివెందులలో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్‌లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(శనివారం) పులివెందులలో బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ వ్యక్తులే నామినేషన్ వేశారని ఆరోపించారు బీటెక్ రవి.
వైఎస్ కుటుంబ బంధువులతో నామినేషన్ వేయించారని బీటెక్ రవి ఆక్షేపించారు. వాళ్లే కుట్రలు చేస్తూ తమమీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వారిని అడ్డుకోవాలని పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. పులివెందులలో ఏం జరిగినా తమకు సంబంధం లేదని అనడం తగదని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఎంపీ అవినాష్‌రెడ్డి మెప్పు పొందేందుకు ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల షిఫ్టింగ్ విషయం తమకు తెలియదని తెలిపారు. ఒకే గ్రామ పంచాయతీలో ఓటర్ల మార్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంచారని వెల్లడించారు. ఓటర్ల షిఫ్టింగ్ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని తెలిపారు. ఇంకా పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు రెండు రోజులు సమయమే ఉందని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం
For More AP News and Telugu News