YSRCP Leaders: బెదిరింపుల కేసులో వివేకా హత్య కేసు నిందితులకు నోటీసులు
ABN , Publish Date - Aug 09 , 2025 | 08:35 AM
Notice To YSRCP Leaders: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి కండిషన్ బెయిల్ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ఉన్నారు. దీంతో పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి వారికి నోటీసులు అందించారు.
బెదిరింపుల కేసులో పలువురు వైఎస్సార్ సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ రెడ్డి వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీ మారినందుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పీఎ రాఘవ రెడ్డిలతో పాటు అదే గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డిలు తనను తీవ్రస్థాయిలో బెదిరించారంటూ విశ్వనాథరెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫోన్ కాల్ డేటా ఆధారాలను వారికి అందజేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 41ఏ కింద నిందితులందరికీ పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి కండిషన్ బెయిల్ దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ఉన్నారు. దీంతో పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి వారికి నోటీసులు అందించారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
రాఖీ సినిమా లెవెల్లో మేయర్ క్రేజ్.. ఏకంగా 20వేల రాఖీలతో రికార్డ్..