Share News

AP GOVT: మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:14 PM

సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది.

AP GOVT: మరో రికార్డు సృష్టించిన చంద్రబాబు సర్కార్
AP GOVT

అమరావతి, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 (India Justice Report 2025) వెల్లడించింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగంతో ర్యాంకింగ్‌లో దిగువకు పడిపోయింది ఆంధ్రప్రదేశ్. 2019 నుంచి 2024 వరకు ఈ అంశాల్లో పడిపోయింది ఏపీ ర్యాంకింగ్.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్లుగా వెల్లడించింది ఇండియా జస్టిస్ రిపోర్టు. పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో ఏపీ పనితీరు మెరుగైనట్లుగా స్పష్టం చేసింది ఇండియా జస్టిస్ రిపోర్టు 2025. ఏపీలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ కేటాయించింది. ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో మొదటిస్థానంలో కర్ణాటక నిలిచింది. 6.32 స్కోర్‌తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

పులివెందుల ఎన్నికలో వైసీపీ నేతలు అవకతవకలకు పాల్పడుతున్నారు: బీటెక్ రవి

For More AP News and Telugu News

Updated Date - Aug 09 , 2025 | 12:37 PM