Share News

Rakhi Festival: ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 03:59 AM

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షా బంధన్‌ అని అన్నారు.

Rakhi Festival: ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌

  • ప్రజలకు మంత్రి పొన్నం,పీసీసీ చీఫ్‌ రాఖీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షా బంధన్‌ అని అన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. మహిళా సాధికారత, వారిని కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.


రాష్ట్రాభివృద్ధిలో మహిళలంతా భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని.. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని సీఎం పేర్కొన్నారు. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 03:59 AM