Share News

CM Revanth: మాటలతో నిర్వచించలేనిది మా అనుబంధం : సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:12 PM

అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధం… ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది అంటూ సీతక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు సీఎం రేవంత్.

CM Revanth: మాటలతో నిర్వచించలేనిది మా అనుబంధం : సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మంత్రి సీతక్కతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రేవంత్. సోదరి సీతక్క పట్ల ఉన్న అనురాగాన్ని ప్రతిబింబిస్తూ.. ఎక్స్ వేదికగా సీఎం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


'అక్షరాలతో రచించలేనిది… మాటలతో నిర్వచించలేనిది… సీతక్కతో నా అనుబంధమని, ప్రతి రాఖీ పౌర్ణమి నాడు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుందంటూ'.. సీతక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైయ్యారు సీఎం రేవంత్. తనకు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ, సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ సుజాతకు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు

మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు

Updated Date - Aug 09 , 2025 | 06:12 PM