Share News

Srushti Fertility Case: సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:03 AM

సృష్టి ఫెర్టిలిటీ కేసులో వైసీపీ నేత సోదరుడు కీలకంగా ఉన్నట్లు సమాచారం. సృష్టి కేసులో అరెస్ట్ అయిన విశాఖ కేజీహెచ్‌కు చెందిన ముగ్గురు వైద్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు డాక్టర్ వాసుపల్లి రవికుమార్ కూడా ఉన్నారు. కేజీహెచ్‌లో అనస్తీషియాలజీ విభాగాధిపతిగా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా రవి కుమార్ కొనసాగుతున్నారు.

Srushti Fertility Case: సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
Srushti Fertility Case

హైదరాబాద్, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ కేసులో (Srushti Fertility Case) వైసీపీ కీలక నేత సోదరుడు కీలకంగా ఉన్నట్లు సమాచారం. సృష్టి కేసులో అరెస్ట్ అయిన విశాఖ కేజీహెచ్‌కు చెందిన ముగ్గురు వైద్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు డాక్టర్ వాసుపల్లి రవికుమార్ కూడా ఉన్నారు. కేజీహెచ్‌లో అనస్థీషియాలజీ విభాగాధిపతిగా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా రవి కుమార్ కొనసాగుతున్నారు. రవి కుమార్ వైసీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్‌కు సోదరుడు అవుతారు.


అయితే, వైసీపీ హయాంలో రవికుమార్ బదిలీ అయ్యారు. తిరిగి కొద్ది రోజులకే డిప్యూటేషన్‌పై కేజీహెచ్‌కు రవికుమార్ వచ్చారు. డాక్టర్ రవికి సృష్టి కేసులో నమ్రత భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1988లో ఎంబీబీఎస్‌లో డాక్టర్ నమ్రత, డాక్టర్ రవి ఇద్దరు ఒకే బ్యాచ్‌లో వైద్య విద్య పూర్తి చేశారు. శిశువిక్రయాల్లో 80 శాతం అరకు, పాడేరు, ఒడిస్సా వంటి ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో నిరుపేద గర్భిణులను గుర్తించి శిశువులను విక్రయించేలా వారితో ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో శిశువులను ఎవరూ అమ్మారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కిర్గిజిస్థాన్‌లో బందీ అయిన కుమారుడు.. విడిపించేందుకు పుస్తెలు తాకట్టుపెట్టిన తల్లి

78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 09:11 AM