Electric Shock: విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:06 AM
పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఘటనలు
యాలాల, ఊట్కూర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు బోరు మోటారు వద్ద వైర్లను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట్‌కి చెందిన పాలేపల్లి రమేశ్ (38) పొలంలో నారుకు నీరు పెట్టేందుకు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. పొలంలో ఉన్న బోరు మోటారును ఆన్ చేయగా అది పనిచేయలేదు. దీంతో తెగి కిందపడిపోయిన సర్వీస్ వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
అలాగే, నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమారినికి చెందిన అస్లాం (33) తన పొలంలో పత్తి పంటను సాగు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం పంటకు నీరు పెట్టేందుకు పొలంలోని బోరు మోటారును ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ వైర్లు తెగిపడటాన్ని గమనించాడు. వాటిని సరిచే స్తుండగా షాక్‌తో చనిపోయాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News