Share News

Adilabad: 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:41 AM

ఆదిలాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రహదారి పక్కన నిద్రిస్తున్న ఓ 78 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Adilabad: 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

  • ఆదిలాబాద్‌ పట్టణంలో దారుణ ఘటన

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రహదారి పక్కన నిద్రిస్తున్న ఓ 78 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఎత్తుకెళ్లి నోటిలో గుడ్డలు కుక్కి ఆపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఆదిలాబాద్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.


ఆదిలాబాద్‌, శివాజీచౌక్‌ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వృద్ధురాలిని ఓ దుండగుడు గురువారం అర్ధరాత్రి తర్వాత బలవంతంగా పక్క సందులోకి ఎత్తుకెళ్లాడు. ఓ దుకాణం వద్ద వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 09 , 2025 | 05:41 AM