Gulf Countries: గల్ఫ్‌లో 45 వేల మంది తెలంగాణ కార్మికులు
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:33 AM
గల్ఫ్ దేశాల్లో 45 వేలకు పైగా తెలంగాణ కార్మికులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. విదేశాల్లోని వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి భద్రతకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వారి భద్రతకు ప్రత్యేక విభాగాలు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ దేశాల్లో 45 వేలకు పైగా తెలంగాణ కార్మికులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. విదేశాల్లోని వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి భద్రతకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో ఎంపీ ఆర్ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గల్ఫ్ సహా అన్ని దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు తెలంగాణ కార్మికుల రక్షణ కోసం పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
అత్యవసర సమయాల్లో సంప్రదించడానికి ఈ మెయిల్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, సోషల్ మీడియా వంటి మార్గాలున్నాయని, తక్షణ స్పందన కోసం ప్రత్యేక విభాగాలూ పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, 2024-25 లో తెలంగాణకు కేంద్రప్రభుత్వం పలు పథకాల కింద నిధులు కేటాయించింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కింద రూ. 67.16 కోట్లు, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.208.82 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్‌సభలో తెలిపారు. శుక్రవారం ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News