Share News

Fatal Accident: కాళ్లపారాణి ఆరకముందే కబళించిన మృత్యువు

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:09 AM

పెళ్లయి కాళ్ల పారాణి కూడా ఆరని నవ వధువును లారీ రూపంలో వచ్చిన మృ త్యువు బలిగొంది. నవదంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆ వధువు దుర్మరణం చెందగా.. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Fatal Accident: కాళ్లపారాణి ఆరకముందే కబళించిన మృత్యువు

  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ..

  • నవ వధువు మృతి.. భర్తకు గాయాలు

  • కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ వద్ద ప్రమాదం

తిమ్మాపూర్‌/ చొప్పదండి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పెళ్లయి కాళ్ల పారాణి కూడా ఆరని నవ వధువును లారీ రూపంలో వచ్చిన మృ త్యువు బలిగొంది. నవదంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆ వధువు దుర్మరణం చెందగా.. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన ముద్దసాని అఖిల(22)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌కు చెందిన రాజుతో ఆగస్టు6న వివాహం జరిగింది. పీజీ ప్రవేశపరీక్ష రాయడానికి అఖిల, భర్త రాజుతో కలిసి శుక్రవారం ఉదయం లొత్తూనూర్‌ నుంచి ద్విచక్రవాహనంపై తిమ్మాపూర్‌లోని పరీక్ష కేంద్రానికి వచ్చింది.


పరీక్ష అనంతరం వారు రుక్మాపూర్‌లోని అఖిల ఇంటికి బయలుదేరారు. శుక్రవారం అఖిల ఇంట్లో నల్లపూసలు కుచ్చుకునే కార్యక్రమం ఉండగా, శనివారం అఖిల.. తమ్ముడికి రాఖీ కట్టాలని అనుకుంది. అయితే, ఈ నవదంపతుల ద్విచక్రవాహనాన్ని తిమ్మాపూర్‌వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. వారిద్దరూ కింద పడిపోగా.. లారీ అఖిల తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అఖిల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 05:09 AM