ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు

ABN, Publish Date - Mar 11 , 2025 | 07:35 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్‌వీసీ సొరంగంలో 18వ రోజు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీం పనులను కలెక్టర్ పరిశీలించారు. రోబో మిషిన్లతో పాటూ కేరళ డాగ్స్‌తో సొరంగం మార్గంతో సిబ్బంది పరిశీలించారు.

1/10

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్‌వీసీ సొరంగంలో రెస్క్యూ బృందాల పనులు 18వ రోజు కొనసాగుతున్నాయి.

2/10

సొరంగంలో రెస్క్యూ టీం పనులను కలెక్టర్ బాదవత్ సంతోష్ పరిశీలించారు.

3/10

టన్నెల్‌లో రోబోతో చేపడుతున్న పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.

4/10

ఏఐ బేస్ట్ కెమెరా సదుపాయం గల రోబోలను మంగళవారం సొరంగంలోకి పంపించారు.

5/10

సహాయక చర్యల్లో ఎలాంటి ప్రమాదమూ జరగకుండా రోబోలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

6/10

రోబోలను ఉపయోగించాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు AI- ఆధారిత రోబోటిక్ కెమెరా వ్యవస్థను వినియోగించారు.

7/10

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కార్యాలయంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై విపత్తు, నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ బాదవత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

8/10

విరామ సమయంలో టన్నెల్ వద్ద భోజనాలు చేస్తున్న సిబ్బంది.

9/10

మొత్తం 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా సొరంగంలోకి వెళ్లారు. సొరంగం లోపల నీరు, బురద కారణంగా లోపల చిక్కుకున్నవారి ఆచూకీ, మృతదేహాల వెలికితీత సవాలుగా మారింది.

10/10

కాలువలో 13 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తి కాగా.. లోపల నుంచి నీళ్లు ఊట ఊరడంతో బురద పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. కెడావర్ డాగ్స్, రోబోల ద్వారా డెత్ స్పాట్స్ గుర్తిస్తే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 07:36 PM