MLA Naveen Yadav: ఎమ్మెల్యేగా ధృవపత్రం అందుకున్న నవీన్ యాదవ్..
ABN, Publish Date - Nov 14 , 2025 | 07:21 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని ఓట్ల కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారుల నుంచి నవీన్ యాదవ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని ఓట్ల కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారుల నుంచి నవీన్ యాదవ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.
అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు.
అధిక బడ్జెట్ తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో తనను జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించారన్నారు.
తనను ఎమ్మెల్యేగా గెలుపించినందుకు నియోజకవర్గం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు తనను గెలిపించుకున్నారని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని స్పష్టం చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సమయంలో కక్ష పూరిత రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. కానీ తాను అలాంటివి చెయ్యనన్నారు.
అందరినీ కలుపుకుని వెళ్లి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మన ప్రాంత సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
తనను, తన కుటుంబం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఓట్లు అడిగారని.. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రిగ్గింగ్, దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు.
Updated Date - Nov 14 , 2025 | 07:22 PM