తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన నందమూరి బాలకృష్ణ
ABN, Publish Date - Jun 14 , 2025 | 06:55 AM
పద్మభూషణ్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం(జూన్13)న రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. బాలకృష్ణ వెంట బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో, బోర్డు సభ్యులు ఉన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
పద్మభూషణ్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం(జూన్13)న రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు.
బాలకృష్ణ వెంట బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో, బోర్డు సభ్యులు ఉన్నారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు.
ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.
వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి గవర్నర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న దృశ్యం
Updated Date - Jun 14 , 2025 | 06:58 AM