Khairatabad Ganesh: బై బై గణేశా! ఖైరతాబాద్ గణపతికి భక్తుల ఘన వీడ్కోలు
ABN, Publish Date - Sep 06 , 2025 | 03:23 PM
దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగం వైభవంగా సాగుతున్నాయి. హైదరాబాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు.
9 రోజుల పాటు పూజలందుకున్న బడా గణేష్‌ను గంగమ్మ ఒడికి సాగనంపడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఉదయం ఐదున్నర గంటలకు చివరి పూజల అనంతరం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది.
వెల్డింగ్ వర్క్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వరకూ సాగింది. సరిగ్గా 1:21 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడిని చేరుకున్నాడు.
ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ నంబర్ 4 వద్ద జరిగిన తుదిపూజలతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది.
హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ 'గణపతి బప్పా మోరియా' అనే నినాదాలతో మార్మోగిపోయాయి.
Updated Date - Sep 06 , 2025 | 03:23 PM