చారిత్రాక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన భాగ్యనగరం.. వాటి ప్రస్థానం..
ABN, Publish Date - Dec 30 , 2025 | 02:12 PM
హైదరాబాద్ అంటే అద్భుతమైన చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. వాటిలో గోల్కొండ కోట, ఫతే మైదాన్ప, బ్లిక్ గార్డెన్స్, చాదర్‌ఘాట్, ఉందా బజార్, గౌలిగూడ, లాలాగూడ, సుల్తాన్ బజార్, బేగంపేట్, సోమాజీగూడ వంటి కొన్ని ముఖ్య ప్రదేశాల గురించి ఓసారి తెలుసుకుందాం.
గోల్కొండ కోట: కాకతీయులచే ప్రారంభమై.. కుతుబ్ షాహీలు బలోపేతం చేశారు. నాలుగు వేర్వేరు కోటల సముదాయంతో కూడిన గోల్కొండకోట ఓ అద్భుతమైన నిర్మాణం.
ఫతే మైదాన్: ఫతే అంటే విజయం అని, మైదాన్ అంటే భూమి అని అర్థం. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఓ చారిత్రక బహిరంగ ప్రదేశం. ప్రస్తుతం ఇది లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం పేరిట ప్రసిద్ధిగాంచింది.
పబ్లిక్ గార్డెన్స్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఈ ప్రజా ఉద్యానవనం ఉంటుంది. నగరంలోని పురాతన ఉద్యానవనాల్లో ఒకటైన ఈ పబ్లిక్ గార్డెన్స్‌ను 1846లో నిజాం రాజు నిర్మించాడు.
చాదర్‌ఘాట్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇదో ప్రముఖ ప్రాంతం. మూసీ నదిని ఆనుకుని ఉన్న ఈ ప్రదేశంలో నదిపై నిర్మించిన వంతెనకు ఒకవైపు కోఠి.. మరోవైపు మలక్‌పేట ఉంటుంది.
ఉందా బజార్: ఇది హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న ఓ చారిత్రక, రద్దీగా ఉండే ప్రాంతం. ఇది నిజాం కాలంనాటి ఈడి బజార్, గాజులకు ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్(చుడి బజార్) వంటి మార్కెట్లను కలిగి ఉంటుంది. ఇక్కడ వివిధ రకాల వస్తువులతో పాటు సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. షాపింగ్‌కూ మంచి అనుభూతిని ఇస్తుంది.
గౌలిగూడ: ఇది ఒకప్పుడు నగరపు తొలి ప్రధాన బస్‌స్టాండ్‌కు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం కూలిపోయింది. కానీ చుట్టుపక్కల ప్రదేశమంతా వాణిజ్య, నివాస ప్రాంతంగా కొనసాగుతోంది. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్, పాత ఇళ్లు, మార్కెట్లు వంటివి ఉన్నాయి.
లాలాగూడ: సికింద్రాబాదు శివారులో మల్కాజ్ గిరికి వెళ్లే మార్గంలో ప్రాంతం ఉంటుంది. భారత రైల్వే నిర్వహిస్తోన్న రైల్వే సౌకర్యాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది.
సుల్తాన్ బజార్: హైదరాబాద్‌లోని ఒక చారిత్రాత్మక రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతం. ఇక్కడ వస్త్రాలు, నగల నుంచి ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, గృహోపకరణాలు, చేతిపనుల వరకు అన్ని వస్తువులూ లభిస్తాయి.
బేగంపేట: ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా-6 కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం పేరుమీద దీనికీ పేరుపెట్టారు. షామ్స్ఉల్ ఉమ్రా అమీర్ ఇ కబీర్ రెండో అమీర్‌ను వివాహం చేసుకున్నప్పుడు వరకట్నంలో భాగంగా బషీర్ ఉన్నిసా బేగానికి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు.
సోమాజిగూడ: నిజాం కాలంలోని రెవెన్యూ విభాగ ఉద్యోగి అయిన సోమాజీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడంవల్ల ఈ పేరు వచ్చింది. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ ఇక్కడే ఉంటుంది.
Updated Date - Dec 30 , 2025 | 02:12 PM