Heavy Rain:హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం
ABN, Publish Date - Apr 20 , 2025 | 07:09 AM
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం నెలకొంది.
వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జాం నెలకొంది.
కూకట్‌పల్లిలో వర్షం దంచికొట్టడంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి అవస్థలు ఎదుర్కొన్నారు.
వర్షం నీటితో రోడ్లు చెరువులను తలపించాయి.
మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
డిజాస్టర్ బృందాలను జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అప్రమత్తం చేశారు.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. పాలమాకులలోని తిమ్మాపూర్‌లో గల బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.
Updated Date - Apr 20 , 2025 | 07:22 AM