ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: శామీర్​‌పేట జీనోమ్​ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్‌కి శంకుస్థాపన.. పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Jul 16 , 2025 | 06:54 AM

మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి జీనోమ్‌ వ్యాలీలో ఐకార్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమ నూతన యూనిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఉద్ఘాటించారు.

1/12

మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి జీనోమ్‌ వ్యాలీలో ఐకార్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమ నూతన యూనిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.

2/12

ఈ కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

3/12

ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

4/12

కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

5/12

పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

6/12

పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని, పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.

7/12

తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

8/12

ప్రపంచ బల్క్‌ డ్రగ్‌ రాజధానిగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

9/12

దేశంలో 33 శాతం టీకాలను కేవలం జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

10/12

బల్క్‌ డ్రగ్స్‌లో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

11/12

కొవిడ్‌ సమయంలో దాదాపు వంద దేశాలకు వ్యాక్సిన్‌ అందించిన ఘనత జీనోమ్‌ వ్యాలీకి దక్కిందని ఉద్గాటించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

12/12

జీవ శాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్‌ హైదరాబాద్‌లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కిచెప్పారు.

Updated Date - Jul 16 , 2025 | 07:06 AM