CM Revanth Reddy: ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ABN, Publish Date - Sep 14 , 2025 | 06:23 AM
కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరుగనుంది. తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంవో సెక్రెటరీ మాణిక్‌రాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరుగనుంది. తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంవో సెక్రెటరీ మాణిక్‌రాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణాలో తెలంగాణ నీటి వాటాల సాధనలో రాజీపడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నీటిలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, సమర్థవంతమైన వాదనలతో మనకు దక్కాల్సిన ప్రతి చీటి చుక్కపై హక్కులను సాధించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
కృష్ణాలో మనకు దక్కాల్సిన 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని దిశానిర్దేశం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్‌కు అందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
గత కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
Updated Date - Sep 14 , 2025 | 06:30 AM