CM Revanth Reddy: హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
ABN, Publish Date - Oct 10 , 2025 | 07:14 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు.
ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని అపారమైన, విస్తృతమైన పెట్టుబడి అవకాశాల గురించి ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. అలాగే, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, తయారీలో భాగస్వామ్య అవకాశాల సమృద్ధి గురించి ముఖ్యమంత్రి వివరించారు.
హెచ్1-బీ వీసాలపై అమెరికా విధించిన కఠిన నిబంధనలపైన, సుంకాల పెంపుపైన సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను తమ ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందని సీఎం స్పష్టం చేశారు.
అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో, ఇండో-యూఎస్ సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్‌రెడ్డి.
అమెరికా తీసుకునే ఇలాంటి నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయని సీఎం చెప్పుకొచ్చారు.
ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - Oct 10 , 2025 | 07:18 AM