ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ABN, Publish Date - Dec 03 , 2025 | 01:54 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం (03-12-2025) ఉదయం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతోపాటు ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని ప్రధానికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. గురువారం (03-12-2025) ఉదయం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతోపాటు ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని ప్రధానికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసి.. ఈ సమ్మిట్‌కు ఆహ్వానించారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ వెంట.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.
బుధవారం సాయంత్రమే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Updated Date - Dec 03 , 2025 | 01:56 PM