CM Revanth Reddy inaugurates Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 04 , 2025 | 07:26 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ జిల్లా నుంచే లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చండ్రుగొండలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి.
లబ్ధిదారులకు కానుకలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
బెండాలపాడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బచ్చల నర్సమ్మ, రమణకు చెందిన ఇళ్లను సీఎం, మంత్రులు ప్రారంభించి, ఆయా కుటుంబాలతో గృహప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా బచ్చల నరసమ్మ నివాసంలో అల్పాహారం తీసుకున్నారు. అక్కడ నరసమ్మ మనవరాలు పాన్యశ్రీ వెన్సికకు గారె తినిపించి ముద్దుచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి శ్రీకారం, గృహప్రవేశ మహోత్సవాలు రెండూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని గత ఏడాది మార్చి 11వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ప్రారంభ సభ నిర్వహించారు.
ఆ సభలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు నమూనాను విడుదల చేసి కొందరు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
అనంతరం బుధవారం చంద్రుగొండ మండలం బెండాలపాడునుంచే ఇళ్లకు గృహప్రవేశ మహోత్సవాన్ని ఇక్కడి నుంచే నిర్వహించారు.
బెండాలపాడు గ్రామంలో 90 శాతం మంది గిరిజనులు ఉండగా.. భద్రాచలం సైతం గిరిజన ప్రాంతం కావడం విశేషం.
సీఎం రేవంత్‌రెడ్డి సభలో మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు
ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైందని, తెలంగాణ ఉద్యమానికి దిశదశ చూపిందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
'మా ఉద్యోగాలు మాకే కావాలని మా నీళ్లు మాకే కావాలి' అని ఉద్యమించిన చైతన్యవంతమైన జిల్లా ఇదని కొనియా డారు సీఎం రేవంత్‌రెడ్డి.
లబ్ధిదారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులు
Updated Date - Sep 04 , 2025 | 07:34 AM