ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు
ABN, Publish Date - Dec 10 , 2025 | 04:05 PM
ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు మంజూరు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతానన్నారు.
పేదలకు నాణ్యమైన విద్య ఒక్కటే తలరాతను మార్చుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి వీరులను ఓయూనే అందించిందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం కొనియాడారు.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చేసిన మార్పులు, కొత్త యూనివర్సిటీల ఏర్పాటుపై వివరణ ఇచ్చారు.
ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Updated Date - Dec 10 , 2025 | 04:06 PM