Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు..
ABN, Publish Date - Jul 08 , 2025 | 08:41 PM
Secunderabad Monda Market Bonalu 2025: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బోనాల అమ్మకాల సందడి షురూ అయింది. అమ్మవారి రూపాలతో తీర్చిదిద్దిన రంగురంగుల బోనాలు మార్కెట్లో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి.
ఆషాఢ మాసం కావడంతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో బోనాల పండగ సందడి నెలకొంది.
ప్రత్యేకించి సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బోనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
జులై 13వ తేదీన సికింద్రాబాద్ బోనాలు ప్రారంభం కానుండటంతో ప్రజలు మోండా మార్కెట్లో బోనాలు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు.
అమ్మవారి ముఖచిత్రంలో తీర్చిదిద్దిన అందమైన రంగురంగుల కుండలు మోండా మార్కెట్లో అందరినీ అమితంగా ఆకర్షిస్తున్నాయి.
అమ్మవారి రూపాన్ని వేసిన కొండల బోనం మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇక మోండా మార్కెట్లో రూ.200 నుంచి మొదలుకుని రూ.2000 ల వరకూ వివిధ ధరల్లో బోనాలు అందుబాటులో ఉన్నాయి.
Updated Date - Jul 08 , 2025 | 08:41 PM