Bonalu 2025: అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Jul 13 , 2025 | 07:32 PM
ఆషాఢ మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
ఆషాఢం మాసం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు పండగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లోని వివిధ దేవాలయాల్లో కొలువు అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తున్నారు.
ఆ క్రమంలో జులై 13వ తేదీ.. అంటే ఆదివారం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (హెచ్) ప్రాంగణంలోని అమ్మవారిని ఆ పరిసర ప్రాంతాల్లోని భక్తులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు మహిళలు బోనం సమర్పించారు.
అలాగే పోతురాజుల సైతం విన్యాసాలు చేశారు. అవి స్థానికులను ఆకట్టుకున్నాయి.
బోనం సమర్పించిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్న భక్తులు
అమ్మవారి దర్శనం కోసం దేవాలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు.
Updated Date - Jul 13 , 2025 | 07:33 PM