రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం, ఎండీ నాగిరెడ్డి
ABN, Publish Date - Dec 10 , 2025 | 07:23 PM
సికింద్రాబాద్ రాణిగంజ్ డిపోలో బుధవారం భారీగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమైనాయి. ఈ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రారంభించారు. ఈ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎం. శ్రీలత రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రాణిగంజ్ డిపోలో బుధవారం భారీగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమైనాయి.
ఈ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డితోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎం. శ్రీలత రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ డిపో నుంచి భారీగా బస్సులను ప్రారంభించారు. దీంతో నగర ప్రజలకు పదుల సంఖ్యలో బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ, మేయర్ పరిశీలించారు. అనంతరం బస్సులో వారంతా ప్రయాణించారు.
బస్సుల ప్రారంభం సందర్భంగా వాటిని బంతిపూలతో అందంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ వై నాగిరెడ్డితో కలిసి ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు గ్రూప్ ఫొటో దిగారు.
Updated Date - Dec 10 , 2025 | 07:24 PM