Puttaparthi Sathya Sai Baba: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు
ABN, Publish Date - Nov 19 , 2025 | 08:10 AM
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సత్యసాయి బాబా మహాసమాధిని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు దర్శించుకున్నారు. బాబా మహా సమాది దగ్గర వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబా ఫొటోను ఆయనకు అందజేశారు. అనంతరం వెంకయ్యనాయుడును బ్రాహ్మణులు ఆశీర్వదించారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
సత్యసాయి మహాసమాధిని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు దర్శించుకున్నారు.
సత్యసాయి బాబా మహా సమాది దగ్గర వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు.
సత్యసాయి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు వెంకయ్యనాయుడు.
వెంకయ్య నాయుడుకి వేంకటేశ్వర స్వామి విగ్రహం అందజేస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.
సత్యసాయి బాబా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నవెంకయ్యనాయుడు.
Updated Date - Nov 19 , 2025 | 08:22 AM