Nandamuri Balakrishna: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ
ABN, Publish Date - Sep 27 , 2025 | 02:33 PM
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇవాళ (శనివారం) దర్శించుకున్నారు.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.
బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లి అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
భక్తులకు దేవస్థానం అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని ప్రశంసించారు. దుర్గామాత ఈ ఏడాది 11 అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని తెలిపారు బాలకృష్ణ.
ప్రతి అవతారంలోనూ భక్తులపై కరుణ చూపే మహా తల్లి దుర్గమ్మ తల్లి అని వెల్లడించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) వీకే శీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.
Updated Date - Sep 27 , 2025 | 02:33 PM