Beeranna Bonalu: భక్తి శ్రద్ధలతో బీరన్నకి బోనాలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 08:07 AM
వరంగల్‌లోని ఉర్సుగుట్టలో గల బీరన్న స్వామికి బోనాలను భక్తులు ఆదివారం సమర్పించారు. ఈ వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున బీరన్నకి మంత్రి తొలి బోనం సమర్పించారు. తొలి బొనం బీరన్నకి సమర్పించడంతో బోనాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
వరంగల్‌లోని ఉర్సుగుట్టలో గల బీరన్న స్వామికి బోనాలను భక్తులు ఆదివారం సమర్పించారు.
ఈ వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున బీరన్నకి మంత్రి కొండా సురేఖ తొలి బోనం సమర్పించారు.
తొలి బొనం బీరన్నకి సమర్పించడంతో బోనాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
ఆషాఢ మాసం బోనాల పండగ సందర్భంగా ఆదివారం బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు.
బీరన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
బీరన్న స్వామికి బోనాలను సమర్పించడానికి ఆలయానికి వస్తున్న భక్తులు
బోనాల సందర్భంగా వరంగల్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు సందడిగా జరిగింది.
బోనాలు తెచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో బీరప్ప బోనాలకు శ్రీకారం చుట్టారు.
భక్తులు మట్టికుండల్లోనే బోనాలు తీసుకెళ్లి బీరన్నకి మొక్కులు చెల్లించారు.
ఆలయ పూజారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు.
బీరన్నని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
బోనాలను తీసుకువస్తున్న భక్తులు
Updated Date - Jul 07 , 2025 | 08:29 AM