Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఆగమన్
ABN, Publish Date - Aug 26 , 2025 | 07:24 AM
ఈ ఏడాది వినాయక చవితికి ఖైరతాబాద్ గణేషుడు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబయ్యారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుని వద్ద కూడా ఆగమన యాత్ర నిర్వహించడం మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది. ఏకంగా ఆరు రకాల బ్యాండ్‌లు, భారీ ఏర్పాట్లతో అక్కడ ఘనంగా ఆగమన వేడుక నిర్వహించడం విశేషం. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్.. స్థానిక యువతతో కలసి సరదాగా స్టెప్పులేశారు. అయితే, స్వామి వారికి చవితి పండుగ రోజున తొలి పూజలను సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం పూజలకు హాజరు కానున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తొలిరోజు పూజలకు హాజరవుతానని సీఎం హామీ ఇచ్చినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఏడాది వినాయక చవితికి ఖైరతాబాద్ గణేషుడు విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముస్తాబయ్యారు.
ఈసారి ఖైరతాబాద్ గణేశుని వద్ద కూడా ఈ ఆగమన యాత్ర నిర్వహించడం మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది.
ఖైరతాబాద్ గణేష్ వద్ద డోలు వాయిస్తున్న వాయిద్యకారులు
ఖైరతాబాద్ గణేష్‌ని చూడటానికి భారీగా తరలి వచ్చిన భక్తులు
ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ్ విగ్రహాలు
బాణాసంచా వెలుగుల్లో ఖైరతాబాద్ గణేష్
బాణాసంచాను కాల్చి ఖైరతాబాద్ గణేష్ ఆగమన యాత్రను ఘనంగా నిర్వహించారు.
ఖైరతాబాద్ గణేష్ పాదాలు
Updated Date - Aug 26 , 2025 | 07:30 AM