Hyderabad Old City Bonalu: పాతబస్తీలో అంబారీపై ఘటాల ఊరేగింపు
ABN, Publish Date - Jul 21 , 2025 | 09:57 PM
హైదరాబాద్‌లోని పాతబస్తీలో లాల్ దర్వాజా సింహావాహిని మహాంకాళీ అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగాయి. పాతబస్తీలో ఫలహార బండ్లపై భారీగా ఘటాలని ఊరేగించారు. తొలిసారిగా పాతబస్తీలో అంబారీపై ఘటాలని ఊరేగించారు. హరి బౌలి అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీపై ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపులో కర్ణాటకలోని తుంకూరుకు చెందిన 35 ఏళ్ల ఏనుగు ( అంబారీ ) లక్ష్మీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కన్న మాదన్న మహంకాళీ మందిరం నుంచి సుధాటాకీస్, లాల్ దర్వాజా , శాలిబండా, చార్మినార్ మీదుగా ఘటాలని ఊరేగించారు. ఘటాల ఊరేగింపు సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబారీ సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ సీపీ చేతుల మీదుగా అంబారీ యాత్ర ప్రారంభమైంది. అక్కన్న మాదన్న మందిరం నుంచి అంబారీ యాత్ర ప్రారంభమై నయాపుల్ మహంకాళి ఆలయం వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మహంకాళి టెంపుల్ వద్ద ఘటాల సమర్పణతో ఈ ఊరేగింపు ముగిసింది.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో లాల్ దర్వాజా సింహావాహిని మహాంకాళీ అమ్మవారి బోనాలు కన్నుల పండువగా కొనసాగాయి.
పాతబస్తీలో ఫలహార బండ్లపై భారీగా ఘటాలని ఊరేగించారు.
తొలిసారిగా పాతబస్తీలో అంబారీపై ఘటాలని ఊరేగించారు.
హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీపై ఊరేగింపు కొనసాగింది.
ఈ ఊరేగింపులో కర్ణాటకలోని తుంకూరుకు చెందిన 35 ఏళ్ల ఏనుగు (అంబారీ ) లక్ష్మీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అక్కన్న మాదన్న మహంకాళీ మందిరం నుంచి సుధాటాకీస్, లాల్ దర్వాజా , శాలిబండా, చార్మినార్ మీదుగా ఘటాలని భక్తులు ఊరేగించారు.
లాల్ దర్వాజా సింహావాహిని మహాoకాళీ ఆలయం వద్ద మొదలైన రంగం కార్యక్రమంలో కుండపై నిలబడి భవిష్యవాణీ వినిపిస్తున్న మాతంగి అనురాధ
ఘటాల ఊరేగింపు సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో బ్రహ్మోస్ క్షిపణులను ఏర్పాటు చేశారు. వీటిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
చార్మినార్ పరిసరాల్లో బ్రహ్మోస్ క్షిపణులు
హిందూ దేవతల రూపాల్లో కళాకారులు
ఘటాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు
భారత సైనికుల వేషాధారణలో కళాకారులు
ఏనుగు లక్ష్మీకి అరటికాయలు తినిపిస్తున్న పోలీసులు
ఘటాల ఊరేగింపుని ఫొటో తీస్తున్న యువతి
ఘటాల ఊరేగింపుని చూడటానికి వచ్చిన భక్తజన సందోహం
డోలు కొడుతున్న కళాకారులు
పోతురాజుల విన్యాసాలు
ఘాటాలని ఊరేగిస్తున్న భక్తులు
Updated Date - Jul 21 , 2025 | 10:16 PM